HomeTelugu NewsManchu Lakshmi: కాళ్లపై పడి.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. వీడియో వైరల్

Manchu Lakshmi: కాళ్లపై పడి.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని.. వీడియో వైరల్

Manchu lakshmi fan cried ho

మంచు మోహన్ బాబు కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు లక్ష్మి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో.. పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆమె ఆ తర్వాత నటి మారింది. ఝుమ్మంది నాదం సినిమాలో అతిథి పాత్రతో టాలీవుడ్‍లో తెరంగేట్రం చేస్తుంది. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగెటివ్ రోల్‍లో మెప్పించారు.

ఆ తర్వాత పలు సినిమా చేస్తూ వస్తుంది. మంచు లక్ష్మికి సంబంధించి కొన్న వీడియోలు, ట్రోల్స్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా మంచు లక్ష్మికి సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ ‘ఆదిపర్వం’. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‍లో మంచు లక్ష్మి మాట్లాడుతుండగా సడెన్‍గా స్టేజీపైకి వచ్చిన అభిమాని ఆమె కాళ్లపై పడిపోయాడు. ఎమోషనల్‍గా వచ్చిన ఆ పాదాలను తాకేందుకు ప్రయత్నించారు. దీంతో మంచు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెనక్కి జరిగారు.

అభిమాని నమస్కరించడంతో ఆమె కూడా నమస్కారం చేశారు. ఓకే నాన్న తర్వాత మాట్లాడదాం అని తన అభిమానికి చెప్పారు. అనంతరం ఈవెంట్ అయిపోయాక అతడితో ఆమె ఫొటో దిగారు. మంచు లక్ష్మి రావడంతో అతడు కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. తాజాగా మీమర్స్‌కి మరో వీడియో దొరికినట్లు అనిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by NBUR (@naku_bhutulu_urike_ravuu)

Recent Articles English

Gallery

Recent Articles Telugu