నేనందుకున్న కిరీటాల్లో ఇది ఎంతో విలువైంది: ఐశ్వర్యారాయ్

1994లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకున్నారు ఐశ్వర్యారాయ్‌. మళ్లీ ఇప్పుడు 24 సంవత్సరాల తర్వాత మరో కిరీటం ఆమె తలమీద వచ్చి వాలింది. ఈ సారి అందాల పోటీల్లో కాదు. ఈసారి అందిన కిరీటం ఐష్‌ అందానికి కాదు.. ఐష్‌లోని అమ్మకు. ప్రపంచంలోనే బెస్ట్‌ అమ్మ అంటూ ఐష్‌ కుమార్తె ఆరాధ్య ఆమె కోసం ప్రత్యేకంగా కిరీటం తయారు చేసి ఇచ్చారు.

ఆరాధ్య గీసిన బొమ్మలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటుంటారు ఐష్‌. తాజాగా తన ముద్దుల కుమార్తె ఇచ్చిన కానుక గురించి ప్రస్తావిస్తూ.. ‘మా అమ్మాయి నా ప్రపంచం. నా ప్రపంచం ఇచ్చిన సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇది. ఇప్పటివరకూ నేనందుకున్న కిరీటాల్లో ఇది ఎంతో విలువైంది’ అని ఐష్‌ పేర్కొన్నారు.