విడాకులు తీసుకున్న దర్శకుడితో హీరోయిన్ ఎఫైర్!

సినిమా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు, బ్రేకప్ లు సర్వసాధారణం. అయితే సెలబ్రిటీ బ్యాక్ గౌండ్ కావడంతో సామాన్య ప్రేక్షకుల దృష్టి వీరిపై ఎక్కువగా ఉంటుంది. వారి వ్యక్తిగత విషయాలు బయటకు వచ్చాయంటే.. చాలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ యంగ్ హీరోయిన్, డైరెక్టర్ తో ప్రేమలో పడిందని సమాచారం. ఇటీవల టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆ బ్యూటీ సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ ఓ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపిస్తుందని సమాచారం. సదరు డైరెక్టర్ వివాహితుడు కావడం గమనార్హం. ఓ హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ డైరెక్టర్ ఆమె నుండి రీసెంట్ గా విడాకులు తీసుకున్నాడు. 
ప్రస్తుతం తన సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో డైరెక్టర్ గారు తను ప్రేమిస్తోన్న యంగ్ హీరోయిన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఆ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా వారిని మరింత దగ్గర చేస్తుందని అంటున్నారు. ఈ యంగ్ హీరోయిన్ కూడా డైరెక్టర్ గారితో చనువుగా ఉండడం పలుసార్లు కెమెరా కంట చిక్కింది. వీరి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి మరోసారి హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటానంటే.. డైరెక్టర్ 
ఫ్యామిలీ ఒప్పుకుంటుందో.. లేదో.. చూడాలి!