HomeTelugu Big StoriesFahadh Faasil: ఫహద్ ఫాసిల్ 'ఆవేశం' టీజర్‌ చూశారా!

Fahadh Faasil: ఫహద్ ఫాసిల్ ‘ఆవేశం’ టీజర్‌ చూశారా!

AAVESHAM Official Teaser

తాజాగా ఓ కామెడీ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. గతేడాది రొమాంచం పేరుతో హారర్ కామెడీ మూవీ అందించిన మేకర్సే ఇప్పుడు ఆవేశం పేరుతో మరో సినిమా తీశారు. తాజాగా బుధవారం (జనవరి 24) ఈ మూవీటీజర్ రిలీజైంది. ఇందులో ఓ సరికొత్త అవతారంలో ఫహాద్ కనిపిస్తున్నాడు.

ఇన్నాళ్లూ తెలుగు, తమిళం మూవీస్ లో మాస్ పాత్రల్లో నటించిన ఫహాద్.. తొలిసారి ఓ డిఫరెంట్ పాత్రతో వస్తుండటం విశేషం. ఈ మూవీ టీజర్ ఈరోజు (జనవరి 24) విడుదలైంది. ఇందులో ఫహాద్.. రంగా అనే పాత్రలో కనిపించాడు.

గుండుతో ఎప్పుడూ సన్ గ్లాసెస్ ధరించి టీజర్లో కనిపించిన ఫహాద్.. కామెడీ రోల్లోనూ అదరగొట్టేశాడు. ఓవైపు నవ్వస్తూనే మరోవైపు సీరియస్ గూండాగా ఫహాద్ నటించడం విశేషం. మూవీ టైటిల్, అందులో ఫహాద్ కనిపించిన తీరు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఈమూవీ ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతోంది. విషు, ఈద్ లక్ష్యంగా ఆ సమయంలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ సినిమాతో పాటు, పాన్ ఇండియా మూవీ పుష్ప ది రూల్ కూడా విడుదల కానుంది.

పుష్ప తొలి పార్ట్ చివర్లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించిన ఫహాద్.. సెకండ్ పార్ట్ లో మరింత ఎక్కువ సమయం కనిపించనున్నాడు. ఈ మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇదే కాకుండా తమిళంలో వెట్టాయిన్, మలయాళంలో పాట్టు అండ్ మారీశన్ సినిమాల్లోనూ అతడు నటిస్తున్నాడు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu