పక్కా 420గా ఎన్టీఆర్!

హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ తన తదుపరి సినిమాగా ఏం చేస్తాడా..? అని అందరూ
ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను,
పూరీ జగన్నాథ్ వంటి దర్శకులతో పని చేయనున్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. తాజా
సమాచారం ప్రకారం ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ తోనే సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ
చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ‘420’ అనే టైటిల్
అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నిన్నటివరకు ఈ సినిమాకు టైటిల్ గా ‘బాక్సర్’ అనే మాట
వినిపించింది. దీనికి కారణం ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ‘బాక్సర్’ టైటిల్ ను రిజిస్టర్ చేయించడమే..
కానీ పూరీ జగన్నాథ్ మాత్రం ఈ చిత్రానికి ‘420’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయమపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది.

CLICK HERE!! For the aha Latest Updates