HomeTelugu Trendingహీరోగా దగ్గుబాటి అభిరామ్‌ ఎంట్రీ!

హీరోగా దగ్గుబాటి అభిరామ్‌ ఎంట్రీ!

Abhiram daggubati debut mov

ప్రముఖ నిర్మాత సురేశ్‌ బాబు చిన్న కొడుకు.. చిన్న కొడుకు అభిరామ్ దగ్గుబాటి గురించి పెద్దగా పరిచయాం అవసరం లేదు. కొన్నేళ్లుగా అతడి సినిమా ఎంట్రీ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి అవి నిజమవకుండా మిగిలిపోతూ వచ్చాయి. తాజాగా మరోసారి అతడి రంగప్రవేశం గురించి ఇండస్ట్రీలో వార్తలు మొదలయ్యాయి. నటుడు, నిర్మాత రవిబాబుతో అభిరామ్‌ తొలి సినిమా తీయనున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

ఓ వెరైటీ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకోనున్నట్లు సమాచారం. ఈ పాటికే రవిబాబు తను సిద్ధం చేసిన కథను సురేశ్‌ బాబుకు వినిపించగా అతడికి నచ్చిందని అంటున్నారు. అయితే మరిన్ని చర్చలు జరిపిన తర్వాతే ఈ సినిమా ఫైనలైజ్‌ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సారైనా అభిరామ్‌ హీరో ఎంట్రీ ఖాయం కానుందా? లేదా మరికొన్ని రోజులు ఎదురు చూడాలా తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu