HomeTelugu Trendingఅభిషేక్‌ బచ్చన్‌ న్యూలుక్‌.. వైరల్‌

అభిషేక్‌ బచ్చన్‌ న్యూలుక్‌.. వైరల్‌

Amitabh bachchan New Look v

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్ వార‌సుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం బాబ్ బిస్వాస్ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ కోల్‌కతాలో తాజాగా ప్రారంభమయ్యింది. ఈ చిత్రంలో చిత్రాంగద హీరోయిన్‌గా నటిస్తోంది. షారుక్‌ ఖాన్‌ రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారా దర్శకుడు సుజోయ్‌ ఘోష్ కుమార్తె డియా అన్నపూర్ణ ఘోష్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

కాగా, జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. కరోనా నేపధ్యంలో ఆగిపోయింది. అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా సోకి కోలుకున్న విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తల నడుమ షూటింగ్ కొనసాగుతోంది. షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోలను చిత్ర బృందం సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో అభిషేక్‌ గుర్తు పట్టలేని విధంగా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటో వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu