HomeTelugu Trendingశేఖర్‌ కమ్ములతో బిగ్‌బాస్‌ విన్నర్‌

శేఖర్‌ కమ్ములతో బిగ్‌బాస్‌ విన్నర్‌

Abijeet meets Sekhar Kammul
తెలుగు బిగ్‌బాస్‌-4 విన్నర్‌ అభిజిత్ టాలీవుడ్‌లో ‘లైఫ్ ఆఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ‘ఎఫ్‌-3’లో నటించే అవకాశం వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా తనను హీరోని చేసిన డైరెక్టర్ శేఖర్ కమ్ములను కలిశాడు. ఇద్దరు కలిసి చాలాసేపు పాత ముచ్చట్లు మాట్లాడుకున్నారు. అనంతరం శేఖర్ కమ్ములను ఉద్దేశించి.. “సింప్లిసిటీ హ్యుమిలీటి రెస్పెక్ట్.. సినిమాలకంటే ఎక్కువగా నేర్పారు. థ్యాంక్స్ మీ శీను” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇక బిగ్‌బాస్ కప్ గెలిచిన దగ్గర నుండి అభిజిత్ తీరిక లేకుండా సన్నిహితులను సెలబ్రిటీలను కలుస్తూనే ఉన్నాడు. వారితో విన్నింగ్ పార్టీలు చేసుకుంటూనే ఉన్నాడు. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములను కూడా కలిసి ఎమోషనల్ అయ్యాడు అభి. వారిద్దరూ పాత స్నేహితులు కావడంతో అప్పటి విషయాలను మాట్లాడుకున్నారట. ఇక చివరిగా తనకు సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన తర్వాతే తన పనులు ప్రారంభిస్తాను అని అభి తెలిపాడు. ఇక మనోడికి ఇండస్ట్రీ నుండి కూడా ఆఫర్స్ వస్తున్నాయట. మరి ఏం చేస్తాడో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu