కెప్టెన్ చైర్‌లో మెగాస్టార్‌.. యాక్టింగ్‌లో వినాయ‌క్‌!

ద‌ర్శ‌కుడే హీరోని డైరెక్ట్ చేయ‌డం రొటీన్‌..! హీరోనే ద‌ర్శ‌కుడిని డైరెక్ట్ చేస్తే !? .. అది కాస్త
డిఫ‌రెంట్‌!! అది కూడా 150 సినిమాల్లో న‌టించిన ఓ అగ్ర‌ క‌థానాయ‌కుడు కెప్టెన్ చైర్‌లో
కూచుని.. త‌న‌ డైరెక్ట‌ర్‌ న‌టించే స‌న్నివేశాన్ని తెర‌కెక్కిస్తే ఇంట్రెస్టింగ్ అన‌కుండా ఉండ‌లేం.
ప్ర‌స్తుతం `ఖైదీ నంబ‌ర్ 150` సెట్స్‌లో అలాంటి అరుదైన‌ స‌న్నివేశం ఒక‌టి క‌నిపించింది.
వి.వి.వినాయ‌క్ ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్‌లో ఉన్న `ఖైదీ నంబ‌ర్ 150` లో ఓ స‌న్నివేశంలో
న‌టించారు. ఆ స‌న్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్‌లో ఈ షాట్‌ని మంగ‌ళ‌వారం ఉద‌యం చిత్రీక‌రించారు.

ఇంత‌కాలం మెగాస్టార్ న‌టిస్తుంటే ఆ స‌న్నివేశాలను డైరెక్ట్ చేసిన వినాయ‌క్ ఇప్పుడిలా
న‌టుడిగా మారిపోవ‌డం… త‌ను న‌టించే సీన్‌ని అన్న‌య్య స్వ‌యంగా డైరెక్ట్ చేయ‌డం..
రేర్ మూవ్‌మెంట్‌. త‌న జీవితంలో మ‌ర‌పురాని అనుభూతిని మిగిల్చిన సంద‌ర్భం. అయితే
వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెర‌కెక్కించిన‌ `ఠాగూర్‌` చిత్రంలోనూ
ఓ స‌న్నివేశంలో న‌టించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. మ‌రోసారి ఇలా అరుదైన ఛాన్స్
వినాయ‌క్‌కి ద‌క్కింద‌న్న‌మాట‌! ఈ షాట్‌ని మెగాస్టార్ చిరంజీవి డైరెక్ట‌ర్ చేయ‌డం ఓ సెన్సేష‌నే..! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here