కరోనా బాధితులకు టాలీవుడ్ హీరోలు ప్రభాస్, ఎన్టీఆర్ విరాళం


కరోనా నివారణ చర్యలకు టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు తమ వంతు సహాయం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు తమ సహాయాన్ని ప్రకటించారు. తాజాగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ కూడా తన వంతు సహాయం ప్రకటించాడు. కరోనాపై పోరాటానికి, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని ఏపీ సీఎం సహాయ నిధికి, తెలంగాణ సీఎం సహాయ నిధికి అందజేస్తున్నట్లు ప్రభాస్‌ ప్రకటించారు. అదేవిధంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ రూ. 75 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ఈ మొత్తంలో తెలుగు రాష్ట్రాల సీఎంల స‌హాయ నిధికి చెరో రూ.25 ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.50 ల‌క్ష‌ల విరాళంతో పాటు మ‌రో రూ.25 ల‌క్ష‌ల‌ను క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ పేద క‌ళాకారుల‌కు అంద‌చేస్తున్నట్లు తెలిపారు.