HomeTelugu Newsశర్వానంద్‌ పుట్టినరోజు సందర్భంగా.. 'శ్రీకారం' నుంచి సర్‌ప్రైజ్‌..

శర్వానంద్‌ పుట్టినరోజు సందర్భంగా.. ‘శ్రీకారం’ నుంచి సర్‌ప్రైజ్‌..

15 2
యంగ్‌ హీరో శర్వానంద్‌ రైతుగా నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. కిశోర్‌ బి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం శర్వానంద్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ చిత్ర బృందం ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ఆయన యువ రైతుగా పొలం పనులు చేస్తూ కనిపించారు. ‘శ్రీకారం కొత్త సంకల్పానికి..’ అంటూ నేపథ్య గీతం కూడా వినపడింది.

14 రీల్స్‌ ప్లస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ‘గ్యాంగ్‌లీడర్‌’ ఫేం ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రావు రమేశ్‌, ఆమని, నరేష్‌, సాయి కుమార్‌, మురళీ శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu