హిట్ డైరెక్టర్ కు ఛాన్సులు లేవు!

ప‌వ‌ర్ తో తన స్టామినా చూపించిన బాబి.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ విష‌యానికొచ్చేస‌రికి చ‌తికిల ప‌డిపోయాడు. ఈ ఫ్లాప్ ఎఫ్ఫెక్ట్ ఉన్నా కూడా, జై లవ కుశ సినిమాకి సంబంధించి ఆఫర్ దక్కించుకుని ఎన్టీఆర్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్‌ని మూడు విభిన్న పాత్ర‌ల్లో చూపించి స‌క్సెస్ కొట్టాడు బాబి. అంత పెద్ద హిట్ కొట్టినా బాబీ ప్రస్తుతం ఖాళీగా ఉండడం ఒక్కటే అందరినీ కలచి వేస్తోంది.

బాబీకు సంబంధించి ఒక్క వార్త కూడా బయటకు రాకపోవడంతో తను కూడా విశ్రాంతి తీసుకున్నట్లుగా అనిపిస్తోంది. కానీ ఆయన హిట్ ను కాపాడుకోవడానికి జాగ్రత్తగా నెక్స్ట్ స్టెప్ తీసుకోబోతున్నాడని సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రవితేజతో సినిమా ఉంటుందని అంటున్నారు కానీ ఇప్పట్లో ఆ సినిమా వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. మరి బాబి ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో చూడాలి!