పవన్‌ కల్యాణ్‌కు జంటగా ప్రగ్యా జైస్వాల్‌


టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘పింక్‌’ రిమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. తమిళంలో కూడా హిట్‌ సాధించిన పింక్‌ రిమేక్‌ను పవన్‌ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంజలి, నివేదా థామస్‌, అనన్య పాండేలు నటిస్తున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయాలని దిల్‌ రాజు భావిస్తున్నారట.

కాగా, ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే మరో చిత్రాన్ని కూడా సెట్స్‌ పైకి తీసుకెళ్లె పనిలో పవన్‌ ఉన్నట్లు సమాచారం. ఎప్పటినుంచో దర్శకుడు క్రిష్‌ దర్శకత్వంలో పవన్‌ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రంలో పవన్‌ సరసన ‘కంచె’ ఫేమ్‌ ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు అనధికారిక సమాచారం.

చారిత్రక నేపథ్యంతో పాటు ఓ ఎమోషనల్‌ విప్లవాత్మకమైన పాయింట్‌ను కూడా టచ్‌ చేస్తున్నట్టు టాలీవుడ్‌ వార్తలు వినిపిస్తున్నాయి‌. అంతేకాకుండా ఈ చిత్రంలో మంచి కోసం పరితపించే ఓ దొంగ పాత్రలో పవన్‌ నటించనున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు పూరి జగన్నాథ్‌ చిత్రం కూడా లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాల్లోకి పవన్‌ రీఎంట్రీతో అయన అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.