మరోసారి మహేష్ తో తమన్నా..?

మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా
తరువాత కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ హీరోగా మరో సినిమా ఉంటుంది. ఈ చిత్రాన్ని
నిర్మాత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా పలు పేర్లు సంప్రదించినప్పటికీ
ఫైనల్ గా తమన్నాను తీసుకోవాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. గతంలో కూడా తమన్నా,
మహేష్ బాబుతో కలిసి ‘ఆగడు’ సినిమాలో నటించింది. ఇప్పుడు మరోసారి ప్రిన్స్ తో జత కట్టడానికి
సిద్ధంగా ఉంది ఈ మిల్కీ బ్యూటీ. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి!

CLICK HERE!! For the aha Latest Updates