HomeTelugu Trending'ఆచార్య' రెండో పాటకు ముహూర్తం ఫిక్స్‌

‘ఆచార్య’ రెండో పాటకు ముహూర్తం ఫిక్స్‌

Acharya movie Update
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్.. చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. అలానే ఫస్ట్ సింగిల్ ‘లాహే లాహే’ శ్రోతలను అలరిస్తూ యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఈ నేపథ్యంలో సినిమాలోని మరో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

‘ఆచార్య’ చిత్రంలోని ‘నీలంబారి’ అనే గీతాన్ని దీపావళి కానుకగా నవంబర్ 5వ తేదీన ఉదయం 11:07 గంటలకు విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ స్వరపరిచిన ఈ మెలోడీ గీతం మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ – పూజా హెగ్డే లకు సంబంధించిన ఓ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu