HomeTelugu Trendingడబుల్‌ ట్రీట్‌ ఇచ్చిన 'ఆచార్య'

డబుల్‌ ట్రీట్‌ ఇచ్చిన ‘ఆచార్య’

Acharya Release Date announ
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు ఈరోజు డబుల్ ట్రీట్‌ ఇచ్చాడు. ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు ‘ఆచార్య’ టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే, 5.30 గంటలకు ‘ఆచార్య’గ్రాండ్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మే 13న ‘ఆచార్య’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. ఈ సాయంత్రం ఆన్‌లైన్ లో విడుదలైన టీజర్ మెగా ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్న తరుణంలోనే ఈ న్యూస్‌ ఫుల్‌ ఖుషి అవుతున్నారు.

కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవల వచ్చిన చిరంజీవి ఫస్ట్‌లుక్ ‘ఆచార్య’ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఇందులో ‘ధర్మస్థలి’ కాన్సెప్ట్ పై అందరిలోనూ ఆసక్తి అధికమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu