HomeTelugu Trendingరామ్‌ 'రెడ్‌' మూవీ టీజర్‌ 

రామ్‌ ‘రెడ్‌’ మూవీ టీజర్‌ 

6 27

ఎనర్జిటిక్ హీరో రామ్‌ నటిస్తున్న తాజా సినిమా ‘రెడ్‌’. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రామ్‌.. సిద్ధార్థ్‌, ఆదిత్య అనే రెండు పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో నివేదా పేతురాజ్‌, మాళవిక శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘క్రైం హిస్టరీలో ఇలాంటి కేసును చూడడం ఇదే ఫస్ట్‌ టైం’ అనే డైలాగ్‌తో ఆరంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఆకట్టుకుంది . క్లాస్‌, మాస్‌ లుక్స్‌లో రామ్‌ మెప్పించారు.

‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రాల తర్వాత కిషోర్‌ తిరుమల- రామ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రమిది. స్రవంతి రవికిషోర్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తమిళంలో విజయం సాధించిన ‘తడమ్‌’కి రీమేక్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu