HomeTelugu Trendingప్రముఖ దర్శకుడు ప్రతాప్‌ పోతెన్‌ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు ప్రతాప్‌ పోతెన్‌ కన్నుమూత

Actor and director Pratap P

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, డైరెక్టర్‌, సీనియర్‌ నటి రాధిక మాజీ భర్త ప్రతాప్‌ పోతెన్‌(70) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం ఆయన విగత జీవిగా కనిపించారు. ఆయన మరణ వార్త తెలిసి తెలుగు, తమిళ ఇండస్ట్రీకి చెందిన సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.

అయితే ఆయన మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఆయన ఎన్నో సినిమాల్లో చేశారు. తెలుగులో ఆయన ఆకలి రాజ్యం, కాంచనగంగ, మరో చరిత్ర, వీడెవడు.. వంటి చిత్రాల్లో నటించారు. ప్రతాప్‌ పోతెన్‌ నటుడిగా మాత్రమే కాదు పలు చిత్రాలకు డైరెక్టర్‌గా నిర్మాతగా కూడా ఆయన వ్యవహరించారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu