సూర్య మూవీ టైటిల్‌ లాంచ్‌ చేయనున్న రాజమౌళి

స్టార్‌ హీరో సూర్య నటించిన ఎన్జీకే ఎన్నో అంచనాలతో వచ్చిన తమిళంలోనూ.. అటు తెలుగులోనూ భారీ ప్లాప్ అయ్యింది. ఈ సినిమా ప్లాప్ తరువాత సూర్య కాప్పన్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో సూర్య కమాండో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కెవి ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. కాప్పన్ తెలుగు వెర్షన్ కు సంబంధించిన టైటిల్ ను ఈనెల 27 వ తేదీన ఉదయం 10:30 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు.

రాజమౌళి చేతుల మీదుగా ఈ టైటిల్ విడుదల అవుతున్నది. ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న సూర్యకు ఈ సినిమా కీలకం. అందుకే కసితో సినిమా చేస్తున్నాడు. సాయేషా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆర్య ఓ ప్రముఖపాత్రలో కనిపించానున్నారు. ఈ సినిమాను ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.