HomeTelugu Trending'పవర్ స్టార్' పై ప్రకాష్‌ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

‘పవర్ స్టార్’ పై ప్రకాష్‌ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prakash raj comments on rgvవివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. డీజిటల్ వరల్డ్ లో బిజీబిజీగా ఉంటూ కాంట్రవర్సీ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా వర్మ ‘పవర్ స్టార్’ సినిమా ఏ స్థాయిలో వివాదాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. సినిమా చూసిన తర్వాత పవన్ కల్యాణ్ అభిమానులు సైతం ఆర్జీవీ పై పాజిటివ్‌ కామెంట్స్ చేశారు. ఎందుకంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఫ్యూచర్ సీఎం మీరే అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు వర్మ.
అయితే కొంతమంది మాత్రం పవన్ ని కించపరిచేలా ఉంది అంటూ.. ఫైర్ అవుతూనే ఉన్నారు. తాజాగా ‘పవర్‌ స్టార్‌’ సినిమాపై ప్రకాష్‌ రాజ్‌ స్పందించాడు. బావ ప్రకటన స్వేచ్ఛ ఎవ్వరికైనా ఉంటుంది.. హద్దు దాటనంతవరకు ఎలాంటి సమస్య ఉండదు. వర్మ హద్దు దాటడనే అనుకుంటున్నానని అన్నాడు. రామ్ గోపాల్ వర్మతో నేను ఎక్కువగా వర్క్ చేసింది లేదు. కానీ పర్సనల్ గా చాలా సార్లు కలిశాను. ఆయనకున్న తెలివి విజ్ఞానం నిజంగా చాలా గొప్పది. వర్మకు ఉన్న తెలివి, ఇన్‌ఫర్మేషన్‌ ఎవరి దగ్గరా చూడలేదు అంటూ పొగడ్తలతో ముంచేత్తిన పవన్‌ అభిమానులు కూడా వర్మపై ఏదో సినిమా తీసారని తెలిసింది, కొట్టుకోవటం కన్నా ఇది బెటర్‌ కదా అన్నాడు ప్రకాష్ రాజ్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu