HomeTelugu Trendingఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు 'భారతీయుడు-2'?

ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు ‘భారతీయుడు-2’?

kamal haasan indian 2 get r

కమల్‌ హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన సూపర్‌ హిట్‌ ఫిల్మ్‌ ‘ఇండియన్‌’ (తెలుగులో ‘భారతీయుడు’). ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్‌ 2′(తెలుగులో ‘భారతీయుడు 2’) రూపొందుతోంది. ‘ఇండియన్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన శంకరే ‘ఇండియన్‌ 2’ను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించగా, సిద్ధార్థ్, బాబీ సింహా, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కీలకపాత్రలు పోషించారు. సుభాస్కరన్, ఉధయనిధి స్టాలిన్‌ నిర్మించిన ‘ఇండియన్‌ 2’ కి అనిరుద్‌ సంగీతం అదిస్తున్నాడు. మొదటి నుండి అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది.

ఈ ఏడాది మేలో విడుదల కానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులను కూడా ప్రారంభించారట. దీనికి సంబంధించి త్వరలోనే ‘ఇండియన్‌ 2’ సినిమా రిలీజ్‌ గురించిన అధికారిక ప్రకటన కూడా రానుందని వినికిడి.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu