HomeTelugu Trendingమైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీ భర్త అరెస్ట్‌

మైనే ప్యార్ కియా హీరోయిన్ భాగ్యశ్రీ భర్త అరెస్ట్‌

12 2
బాలీవుడ్‌లో మైనే ప్యార్ కియా తెలుగులో ప్రేమ పావురాలుగా 1989లో విడుదలై అప్పట్లో భారీ విజయం సాధించిన సినిమా. ఈ సినిమాలో హీరోయిన్ భాగ్యశ్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తొలి సినిమాతోనే ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంది. భాగ‍్యశ్రీ భర్త హిమాలయ దాసానీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్యాంబ్లింగ్ రాకెట్‌కు సంబంధించిన ఆరోపణలతో వ్యాపార వేత్త అయిన హిమాలయాను అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెయిల్‌ పై విడుదలయ్యారు.

కాగా మేనే ప్యార్‌ కియా ( ప్రేమ పావురాలు) అనే తొలిచిత్రంతో పరిచయమైన భాగ్యశ్రీ.. ఈ చిత్రంలో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కూడా అందుకున్నారు. చిన్ననాటి స్నేహితుడు హిమాలయా దాసానితో వివాహం అనంతరం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. భాగ్యశ్రీకి ఇద్దరు సంతానం. కుమారుడు అభిమన్యు దాసాని మర్ద్‌ కో దర్ద్‌ నహీ హోతా అనే సినిమాతో బాలీవుడ్‌లో పరిచయమయ్యారు.. ఈ ఏడాది మార్చిలో సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu