HomeTelugu Trendingబెల్లంకొండ సినిమాలో నిధి అగర్వాల్‌ ఐటమ్ సాంగ్

బెల్లంకొండ సినిమాలో నిధి అగర్వాల్‌ ఐటమ్ సాంగ్

2 22
టాలీవుడ్‌లో ‘సవ్యసాచి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్‌ నిధి అగర్వాల్. ఈ సినిమాతో పాటు ఆ తరువాత చేసిన ‘మిస్టర్ మజ్ను’ చిత్రం కూడా ప్లాప్‌ కావడంతో ఈ అమ్మడి పనైపోయిందని అనుకున్నారు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సక్సెస్ అందుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమాలో ఆమె అందాల ఆ ఆరబోతకు కుర్రాళ్లు ప్లాట్‌ అయిపోయ్యారు. యూత్ లో ఆమె క్రేజ్ ను గుర్తించిన దర్శక నిర్మాతలు ఆమెకి అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు.

దాంతో సహజంగానే ఆమె పారితోషికం పెరిగిపోయింది. ఐటమ్ సాంగ్ చేయడానికి కూడా ఆమె వెనుకాడటం లేదు. అయితే ఐటమ్ సాంగ్ కి కూడా భారీగానే పారితోషికాన్ని వసూలు చేస్తోందట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘అల్లుడు అదుర్స్’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, బెల్లంకొండ సరసన నభా నటేశ్ – అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్‌ కోసం నిధి అగర్వాల్ ను తీసుకున్నారు. ఇందుకోసం పారితోషికంగా ఆమె 80 లక్షలను వసూలు చేసినట్టుగా చెబుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu