HomeTelugu Trendingమూడో పెళ్లి చేసుకున్న జయసుధ?

మూడో పెళ్లి చేసుకున్న జయసుధ?

actress jayasudha third mar
సీనియర్‌ హీరోయిన్‌ జ‌య‌సుధ‌.. గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సీనియర్‌ హీరోలు ఎన్టీఆర్‌, ఎ.ఎన్‌.ఆర్‌ల‌తో పాటు త‌ర్వాత త‌రం హీరోల్లో చిరంజీవి, మోహ‌న్ బాబు వంటి వారితోనూ ఆమె హీరోయిన్‌గా న‌టించింది. త‌ర్వాత ఆమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారింది. త‌ల్లి, వ‌దిన‌, అమ్మ‌మ్మ‌, నాన్న‌మ్మ పాత్ర‌ల్లో న‌టించి త‌న‌దైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మ‌ధ్య కొంత కాలంగా ఆమె సినిమాల‌కు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే ఆమెకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 64 ఏళ్ల వ‌య‌సులో జ‌య‌సుధ మూడో పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

జ‌య‌సుధ రెండో భ‌ర్త, బాలీవుడ్‌ నడుడు నితిన్ క‌పూర్ 2017లో క‌న్నుమూశారు. కొన్ని మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న ఆత్మహ‌త్య చేసుకున్నారు. ఆ త‌ర్వాత ఆమె త‌న కొడుకుల‌తో నివాసం ఉంటున్నారు. సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ చేస్తూ వ‌స్తున్నారు. అయితే ఇప్పుడు జ‌య‌సుధ మూడో పెళ్లి వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. గ‌తేడాది ఆమె కొన్ని అనారోగ్య కార‌ణాల‌తో అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు ఆమె మ‌ళ్లీ పూర్వ స్థితికి చేరుకుంటున్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌ని పెళ్లి చేసుకుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఈవెంట్స్‌లో ఆయ‌న‌తోనే క‌లిసి జ‌య‌సుధ పాల్గొంటుంద‌ని వినికిడి. ఆ మ‌ధ్య ఆలీ కుమార్తె వివాహంలోనూ జ‌య‌సుధ జంట‌గానే వ‌చ్చారంటున్నారు. మరి ఈ వార్త‌ల్లో నిజమెంతుదో తెలియలంటే.. దీనిపై జ‌య‌సుధ స్పందించాల్సి ఉంది. జ‌య‌సుధ కాక‌ర్ల‌పూడి రాజేంద్ర ప్ర‌సాద్ అనే వ్య‌క్తిని మొదట వివాహం చేసుకున్నారు. కొంత‌కాలానికి మ‌న‌స్ప‌ర్ధ‌ల‌తో విడిపోయారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu