HomeTelugu Trendingమరో రీమేక్ మూవీలో వెంకటేష్

మరో రీమేక్ మూవీలో వెంకటేష్

Venkatesh

దృశ్యం-2 సినిమా ఉత్సాహంతో మరో రీమేక్‌ మూవీకి రెడీ అవుతున్నాడు విక్టరీ హీరో వెంకటేష్. ఇప్పటికే పలు రీమేక్ మూవీల్లో నటించి మంచి హిట్‌లు అందుకున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ఇప్పుడు వెంకటేష్ చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన డ్రైవింగ్ లైసెన్స్ సినిమా తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పృథ్వీరాజ్, సూరజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మలయాళంలో భారీ విజయం సాధించింది. ఇందులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పాత్రకు వెంకటేష్‌ న్యాయం చేయగలడని అంటున్నారు. ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు మరో హీరో పాత్రకు రవితేజ చేయనున్నట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ క్యారెక్టర్ రానా చేయనున్నట్టు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu