HomeTelugu Trendingనటి మీనా కీలక నిర్ణయం

నటి మీనా కీలక నిర్ణయం

Actress meena decided donat
నటి మీనా కీలక ప్రకటన చేశారు. అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్‌ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్‌ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్‌ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్‌ పెట్టారు. అవయవదానం అనేది చాలా గొప్ప విషయమని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో పోరాడుతూ మంచానికే పరిమితమైన వారికి అవయవదానం ద్వారా రెండో జీవితం లభిస్తుందన్నారు. ఒక్క అవయవదాత ముందుకొస్తే 8 మంది ప్రాణాలు నిలుస్తాయన్నారు. అవయవదానం ప్రాముఖ్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు.

కాగా, ఆరేళ్ల వయసులోనే సినిమా రంగంలోకి వచ్చిన మీనా ఎంతోమంది ప్రముఖులతో కలిసి నటించారు. మొత్తంగా 90 సినిమాల్లో నటించారు. ఇటీవలే తన భర్తను కోల్పోయిన మీనా.. ఆ లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన మీనా భర్త విద్యాసాగర్‌కు సరైన సమయంలో ఊపిరితిత్తులు దొరక్క మరణించడంతోనే మీనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అవయవదానానికి ముందుకొచ్చిన మీనాపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.
https://www.instagram.com/p/ChMm1lKvF_H/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu