HomeTelugu Trendingఅందాల రాశి న్యూలుక్‌ చూశారా!

అందాల రాశి న్యూలుక్‌ చూశారా!

1 22

తెలుగులో ఒకప్పుడు తన సినిమాలతో ఒక ఊపు ఊపింది హీరోయన్ అందాల రాశి. బాలనటిగా ఇండస్ట్రీలో నటించిన ఈమె ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తనదైన శైలిలో సత్తా చాటింది. ఆ తర్వాత తనదైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. హీరోయిన్‌గా రాశికి ‘శుభాకాంక్షలు’, ‘గోకులంలో సీత’ సినిమాలు మంచి పేరు తీసుకొచ్చాయి. ఆ తర్వాత రాశి పాతికకు పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. మరోవైపు కొన్ని ప్రత్యేక గీతాల్లోకూడా సత్తా చాటుకుంది. నిజం సినిమాలో వ్యాంప్ తరహా పాత్రలో నటించి మెప్పించింది. చివరగా ‘లంక’ అనే సైకాలజికల్ థ్రిల్లర్ సినిమాలో కనిపించింది. ఈ సినిమాకు ఆమెనే నిర్మాతగా వ్యవహరించింది. తాజాగా మరోసారి నటిగా ముఖానికి రంగేసుకుంది. ఆమె ముఖ్యపాత్రలో నటిస్తూ నటిస్తోన్న సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా కోసం పూర్తి స్లిమ్‌గా మారి అభిమానులను ఆశ్చర్య పరిచింది రాశి. ఈ ఫోటోలో ఉన్న ఆమెను చూసిన ఫ్యాన్స్‌ ప్రశంసలు కురింపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu