HomeTelugu Trendingఆంధ్ర అల్లుడు కాబోతున్న 'రౌడీ బాయ్స్' హీరో!

ఆంధ్ర అల్లుడు కాబోతున్న ‘రౌడీ బాయ్స్’ హీరో!

dil raju nephew is going t 1
టాలీవుడ్‌ వరసగా పెళ్లి భాజాలు మోగుతున్నాయి. ఇప్పటికే పలువరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ క్రమంలో మరో పెద్ద ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్నట్లు టాక్‌. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలుకాబోతోందట. దిల్ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఇంటికి శిరీష్ అల్లుడిగా వెళ్లబోతున్నారని తెలుస్తోంది. డిసెంబర్‌లో నిశ్చితార్థం జరుగుతుందట. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న జైపూర్‌లో పెళ్లి జరుగుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకో విషయం ఏంటంటే.. ఇటీవలే దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి కన్నుమూశారు. ఆయన చనిపోయి ఏడాది పూర్తికాకముందే ఇంట్లో శుభాకార్యం చేయాలని పెళ్లి తేదీని ఫిక్స్ చేశారట.

ఇటీవలే ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. బడా నిర్మాత కొడుకు కావడంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. ఇక ఇప్పుడు మళ్లీ సొంత బ్యానర్‌లోనే ‘సెల్ఫిష్’ సినిమా చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu