HomeTelugu Trendingఆది 'కిరాతక' షూటింగుకు డేట్‌ ఫిక్స్‌

ఆది ‘కిరాతక’ షూటింగుకు డేట్‌ ఫిక్స్‌

adi saikumar kirathaka regu
ఆదిసాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘కిరాత‌క’‌. పాయ‌ల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఎం వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ను డైరెక్ట‌ర్ సోష‌ల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ఆగ‌స్టు 13 నుంచి కిరాత‌క సెట్స్ పైకి వెళ్తుంద‌ని దర్శకుడు తెలియ‌జేస్తూ..ఆది క్రైం సీన్ లో ఉన్న మోష‌న్‌ పోస్టర్ ను విడుద‌ల చేశాడు.

విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్ పై డాక్ట‌ర్ నాగం తిరుప‌తి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి పూర్ణ పోలీస్‌ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టిస్తోంది. దేవ్‌గిల్‌, దాస‌రి అరుణ్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి మ్యూజిక్ కంపోజర్ గా ప‌నిచేస్తున్న ఈ చిత్రానికి రాంరెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu