HomeTelugu TrendingAAAలో తొలిసినిమాగా 'ఆదిపురుష్‌'

AAAలో తొలిసినిమాగా ‘ఆదిపురుష్‌’

Adipurush in AAA
టాలీవుడ్ హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమతం కాకుండా.. వివిధ రకాల వ్యాపారాల్లోనూ రాణిస్తున్నారు. ఇప్పటికే సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఏఎంబీ మాల్ ఓపెన్ చేయగా తాజాగా అల్లు అర్జున్ AAA థియేటర్ ప్రారంభించాడు. అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ సంస్థ మరికొందరు భాగస్వాము లతో కలిసి హైదరాబాద్ అమీర్ పేట లో నిర్మించిన భారీ మల్టీ ప్లెక్స్ ఈ రోజు ప్రారంభమైంది. అమీర్ పేట సత్యం థియేటర్ స్థానం లో ఈ అత్యాధునిక మల్టీప్లెక్స్ ను నిర్మించడం విశేషం.

కాగా ఇప్పుడు ఈ మల్టీ ప్లెక్స్ లో ఫస్ట్‌ మూవీగా పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా జూన్‌16న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా ప్రదర్శిస్తున్నారు అందులోనూ కొత్త మల్టీ ప్లెక్స్ కాబట్టి ప్రేక్షకులు థియేటర్ కి క్యూ కట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా రాముడి సినిమా కూడా.. శుభ శూచికంగా ఉంటుందని అందుకే అల్లు హీరో అలా ప్లాన్ చేశాడనే టాక్‌.

ఈ మల్టీప్లెక్స్ కు ఏషియన్ సత్యం మాల్ అండ్ మల్టీప్లెక్స్ గా నామకరణం చేశారు. ఇందు లోని 4వ అంతస్తులో అల్లు అర్జున్ పేరు ఏషియన్ సినిమాస్ పేరు వచ్చేలా AAA పేరిట వివిధ స్క్రీన్లతో థియేటర్లు ఉన్నాయి. బార్కో లేజర్ ప్రొడక్షన్ 4కే ప్రొజెక్షన్ డాల్బీ అట్మోస్ ఎపిక్ లక్జాన్ స్క్రీన్ ఈ థియేటర్ల ప్రత్యేకతలు. అంతేకాదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కన్నుల పండగలా ఉంటుందట.

ఈ హాల్‌లో.. అల్లు అర్జున్ సినిమా లకు సంబంధించి ఫోటోలు , అవార్డుల ను కూడా పెట్టారట. ఇక మల్టీప్లెక్స్ లో ఫుడ్ కోర్ట్ ను ఆకర్షణీయంగా రూపొందించారు. ఇక ఆదిపురుష్ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ రాముడి గా సీతగా కృతిసనన్ నటించింది. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. T-సిరీస్ UV క్రియేషన్స్ పై వంశీ నిర్మించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu