‘విరుపాక్ష’ మూవీ ట్రైలర్‌

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘విరుపాక్ష’. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన అప్డేట్స్‌ బాగానే వైరల్ అయ్యాయి. టీజర్ కూడా ఈ సినిమాపై అంచనాల పెంచేసింది. తాజాగా ఈ సినియా ట్రైలర్‌ విడులైంది.

కొద్దిసేపటి క్రితం విడుదలైన ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇంతవరకు ఎన్నడూ టచ్ చేయని జానర్లో సాయిధరమ్ తేజ్ విరుపాక్ష సినిమా రాబోతోంది. ఈ సినిమాలో భయం కలిగించే చాలా సన్నివేశాలు ఉండబోతున్నాయి అని ట్రైలర్‌ ద్వారా తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరో ఒక ఊరికి వెళ్లడం ఆ ఊరిలో జనాలు అందరూ కూడా ఏదో జరుగుతోంది అని ఆందోళన చెందడం.. ఇక వరుసగా మరణాలు సంభవించడం.. ఆ తర్వాత హీరో దాన్ని ఎలా చేదించాడు. అసలు మరణాలకు కారణాలు ఏంటి? చేతబడి వెనుక ఉన్న అసలు పాయింట్ ఏంటి? అనే విషయాలను ఇన్వెస్టిగేట్ చేయబోతున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు.

ఈ సినిమాలో థ్రిల్లర్ అంశాలతో పాటు కొన్ని విజువల్ షాట్స్ అలాగే సెట్స్ కూడా అద్భుతంగా ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాలో ‘సార్‌’ ఫేం సంయుక్త హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేయగా సుకుమార్ ప్రత్యేకంగా స్క్రీన్ ప్లే అందించారు .

ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ట్రైలర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఈ ట్రైలర్‌ సినిమాపై విపరీతమైన బజ్‌ని క్రియేట్‌ చేసింది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates