HomeTelugu Trendingమాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: థ‌ర్డ్ సింగిల్ విడుదల

మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం: థ‌ర్డ్ సింగిల్ విడుదల

Adirindey Full Video Song f
టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ ప్రాధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం’. ప్ర‌ముఖ ఎడిట‌ర్ ఎంఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా నుండి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు సినిమాపై భారీ అంచ‌నాలకు క్రియేట్ చేశాడు. యాక్ష‌న్ డ్రామా నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఈ క్ర‌మంలో చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్‌ల‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా మేక‌ర్స్‌ ఈ సినిమాలోని థ‌ర్డ్ సింగిల్ వీడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

‘అదిరింది’ అంటూ సాగే మెలోడియ‌స్ వీడియో సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుద‌ల చేశారు. ఈ పాట‌లో నితిన్‌, కృతి శెట్టి మ‌ధ్య‌ కెమిస్ట్రీ బాగా కుదిరింది. కృష్ణ‌కాంత్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను సంజిత్ హెగ్డే ఆల‌పించాడు. దిగ్గ‌జ స్వ‌ర క‌ర్త మ‌ణిర‌త్నం కుమారుడు మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన ‘రా రా రెడ్డి’ లిరిక‌ల్ సాంగ్ యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో నితిన్ గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. కృతిశెట్టి, క్యాథెరీన్ థెరిస్సా హీరోయిన్లుగా న‌టించిన‌ ఈ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ &ఎంట‌ర్టైన‌మెంట్స్, శ్రేష్ఠ్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై ఎన్‌.సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu