HomeTelugu Trendingనానితో తలపడనున్న యంగ్‌ హీరోయిన్‌..

నానితో తలపడనున్న యంగ్‌ హీరోయిన్‌..

Aditi rao hydari negative rనేచురల్‌ స్టార్‌ నాని వరుసగా సినిమాలతో బీజీగా ఉన్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో టాక్సీవాలా డైరక్టర్ రాహుల్‌ తో చేయబోతున్న సినిమాకి టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. ‘శ్యామ్ సింగ రాయ్’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను పెట్టారు. ఇక నాని హీరోగా తెరకెక్కిన వి మూవీ త్వరలో విడుదల కానుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షణ్‌లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నాని సీరియల్ కిల్లర్ గా కనిపించనున్నాడు. అలాగే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే మరో చిత్రంలో నాని నటిస్తున్నారు. ఇదిలా ఉంటే .. ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా గురించి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఓ హీరోయిన్‌ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అది కూడా విలన్ పాత్ర కోసం. ‘శ్యామ్ సింగ రాయ్’లో ఓ అదిరిపోయే నెగిటివ్ రోల్ ఉందట. ఆ పాత్ర కోసం నటి అదితి రావు హైదరి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె పాత్ర వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu