రూల్స్ బ్రేక్ చేసిందని నటి సంజనకు నోటీసులు


డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదని పలు మార్లు పోలీసులు చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. సెలెబ్రిటీలు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంకేమనాలి. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం కావడంతో రూల్స్‌ని బ్రేక్ చేసినవారు ఎంతటి వారైనా చలాన్లు వేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు నటి సంజన కూడా ఇదే చేసింది. ఒక సెలబ్రిటీ అయి ఉండి నటి సంజన డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫీ వీడియో తీసుకుంది. అది కూడా ఫుల్ ట్రాఫిక్ ఉన్న సమయంలో. బెంగళూరులోని మెజిస్టిక్‌ రోడ్‌లో కారులో వెళ్తూ నటి సంజన సెల్ఫీ వీడియో తీసుకుంది. అంతేగాక దాన్ని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. ఇది కాస్తా బెంగుళూరు పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ఆమెను విచారణకు ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. వివిధ సోషల్ మీడియాల్లో సెలబ్రిటీలను ఫ్యాన్స్ ఫాలో అవుతూంటారు. ఇలాంటి వీడియోలు వాటిల్లో అప్ లోడ్ చేయడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు.

CLICK HERE!! For the aha Latest Updates