HomeTelugu Newsగూఢచారి-2కి సన్నాహాల్లో అడవిశేష్

గూఢచారి-2కి సన్నాహాల్లో అడవిశేష్

10 17

టాలీవుడ్‌లో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాడు హీరో అడవిశేష్. గతంలో క్షణం, గూఢచారి, ఎవరు.. వంటి సినిమాలను తీసి విజయాన్ని సాధించడమే కాకుండా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. గూఢచారి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా గూఢచారి2 తెరకెక్కిస్తామని అప్పట్లోనే చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రం సీక్వెల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నాడు అడవిశేష్.

ఓ వైపు హీరోగా నటిస్తూ మరోవైపు స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం, స్క్రిప్టు విషయంలో రాణిస్తున్నాడు అడవిశేష్. గూఢచారి-2 సినిమాకు సంబంధించిన కథను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో తన తర్వాతి సినిమా కోసం స్క్రిప్ట్ తయారు చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడట అడవిశేష్. ప్రస్తుతం అడవిశేష్ నటిస్తున్న మేజర్ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాను ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ ఉన్నికృష్ణన్‌కు సంబంధించిన కథాంశంతో సోనీ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత గూఢచారి2 సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu