HomeTelugu Trending'ఆర్‌ ఆర్‌ ఆర్‌'లో అతిథిగా బాలీవుడ్‌ నటుడు?

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో అతిథిగా బాలీవుడ్‌ నటుడు?

3 11దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మూవీకి సంబంధించి రోజుకో కొత్త విషయం తెరపైకి వస్తోంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు తాజాగా వార్తలు వెలువడుతున్నాయి.

ఆయన పాత్ర చిన్నదే అయినా ఆసక్తికరంగా ఉండబోతోందని అజయ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు. రాజమౌళి తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాను హిందీలో ‘మక్కీ’ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకు అజయ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. అప్పటి నుంచి రాజమౌళి, అజయ్‌ మంచి స్నేహితులయ్యారు. అందుకే సినిమాలో అజయ్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం అజయ్‌ ‘తానాజీ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యాక ఆయన ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాలో నటిస్తారని సమాచారం.

ఇప్పటి వరకు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాకు సంబంధించిన టైటిల్‌ కానీ ఫస్ట్‌లుక్‌ కానీ ఇతర నటీనటుల వివరాలు కానీ బయటకు రాలేదు. మార్చిలో రామ్‌చరణ్‌ పుట్టినరోజు వస్తోంది. అప్పుడైనా సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించిన ఏదో ఒక విషయాన్ని చిత్రబృందం విడుదల చేస్తుందని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య సినిమాను నిర్మిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రాన్నికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు నెట్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu