HomeTelugu Big Stories'ఆర్‌ఆర్‌ఆర్‌' నుండి అజయ్‌ దేవ్‌గణ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి అజయ్‌ దేవ్‌గణ్‌ బర్త్‌డే గిఫ్ట్‌ వచ్చేసింది

Ajay Devgn motion poster fr

దర్శక ధీరడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్నారు. ఇక సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఈ సినిమాను 2021 అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే.. ఈరోజు అజయ్‌ దేవ్‌గణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. శత్రు సేనలు దేవ్‌గన్‌ను చుట్టుముట్టినట్లు ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ అద్భుతంగా ఉంది. అంతేకాదు ఈ పోస్టర్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌.. పవర్‌ ఫుల్‌ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ అందరినీ ఎంతోగానే ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్‌ నటి ఒలీవియా మోరీస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కీరవాణి స్వరాలు అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

Recent Articles English

Gallery

Recent Articles Telugu