HomeTelugu Trending'చోర్ బజార్' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘చోర్ బజార్’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Akash puri chor bazaar movi

స్టార్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరీ నటించిన తాజా చిత్రం ‘చోర్ బజార్’. ఈ సినిమాలో గెహన సిప్పీ హీరోయిన్‌గా నటించింది. ‘దళం’, ‘జార్జ్ రెడ్డి’ సినిమాలతో టాలీవుడ్ లో తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా పాటలు హిట్ అయ్యాయి. వీటన్నింటి వల్ల ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. బిజినెస్ సర్కిల్ లో కూడా క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం ఈ నెల 24న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.

‘చోర్ బజార్’ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించారు. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఐవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత వీఎస్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లూరి సురేశ్ వర్మ సహ నిర్మాతగా వ్యవహరించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu