HomeTelugu Trendingదెబ్బతిన్న 'శ్యామ్‌ సింగ రాయ్‌' సెట్‌.. కోట్లలో నష్టం!

దెబ్బతిన్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ సెట్‌.. కోట్లలో నష్టం!

Shyam singha roy movie se
నెచ్యురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా నాని కెరియర్లోనే భారీ బడ్జెట్‌ తో నిర్మితమవుతోంది. ఈ సినిమా కోసం 10 ఎకరాల్లో ఆరున్నర కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ సెట్లు వేశారు. నిన్న మొన్నటి వరకూ ఈ సెట్లోనే కీలకమైన సన్నివేశాలను రూపొందిస్తూ వచ్చారు. కరోనా ఎఫెక్ట్‌తో షూటింగును వాయిదా వేశారు.

అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ సెట్ భారీగానే దెబ్బతిందట. ఇలా జరగడం నిర్మాతకు కొంత నష్టాన్ని కలిగించిందనే అంటున్నారు. ఈ సెట్ ను మళ్ళీ పునర్నిర్మించడానికి మరో రెండు కోట్ల రూపాయల దాకా ఖర్చయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.. కరోనా లేకపోతే ఈ పాటికే ఆ సెట్టులో షూటింగు పూర్తి అయిపోయేదనీ, ఈ నష్టం జరగకుండా ఉండేదని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో నాని డిటెక్టివ్ గా నటిస్తుండగా, సాయిపల్లవి .. కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటస్తున్నారు. మిక్కీ.జె మేయర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu