HomeTelugu Trendingకౌబాయ్ గెటప్‌లో అఖిల్ అక్కినేని

కౌబాయ్ గెటప్‌లో అఖిల్ అక్కినేని

Akhil Akkineni in Cow Boy g

నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్కటీ ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాయి. ఇండస్ట్రీకి పరిచయమై ఐదేళ్లు కావస్తోంది. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ చేస్తున్నాడు అఖిల్. ఈ చిత్రంలో పూజహెగ్డే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాపై అఖిల్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ యువ హీరోకు సంబంధించిన ఓ ఫోటో మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్ కౌబాయ్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు టక్కరిదొంగ పేరుతో ఓ కౌబాయ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టక్కరి దొంగ సెట్స్ కి వెళ్లిన అఖిల్ కౌబాయ్ గెటప్ వేసుకున్నాడు. అప్పుడు అఖిల్ వయసు ఎనిమిదేళ్లు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu