HomeTelugu Trending'ఖిలాడి'లో మలయాళ నటుడు

‘ఖిలాడి’లో మలయాళ నటుడు

Malayalam actor unni mukund
మాస్‌ మహారాజా ర‌వితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈసినిమాకి ప్లేస్మార్ట్ అనేది ఉప‌శీర్షిక‌. ‘పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్క‌నున్న చిత్రంలో రవితేజ పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. తన శక్తియుక్తులతో శత్రువుల ఆటకట్టించే వ్యక్తి కథతో రూపొందుతుంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. యాక్ష‌న్ కింగ్ అర్జున్ నెగెటివ్ రోల్ పోషిస్తున్నారు. తాజాగా మ‌ల‌యాళ న‌టుడు ఉన్ని ముకుంద‌న్ కూడా ఖిలాడి చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. భారీ క్యాస్టింగ్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్న ఈ సినిమా ర‌వితేజ‌కు మ‌రో హిట్ ఇవ్వాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మే 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల టీజ‌ర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన రవితేజ్‌ క్రాక్‌ సినిమా మంచి హిట్‌ అయిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu