HomeTelugu Trendingఅఖిల్ 'ఏజెంట్' న్యూ లుక్ విడుదల

అఖిల్ ‘ఏజెంట్’ న్యూ లుక్ విడుదల

Akhil Agent new look

యంగ్ హీరో అఖిల్‌ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ చిత్రంలో అఖిల్ ఓ కొత్త రూపంలో కనిపించబోతున్నాడు. ఇప్పటివరకు లవర్‌బోయ్‌గా, పక్కింటి కుర్రాడి తరహాలో కనిపించిన అఖిల్ ఇప్పుడు తనలోని అసలు సిసలైన మాస్ ఇమేజ్‌ను చూపించబోతున్నాడు. ఏజెంట్ విక్రమ్‌లో కండలతో, పచ్చబొట్టుతో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించి అభిమానులను ఊరిస్తూ ఓ స్టిల్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది ఆరంభం మాత్రమే ముం ముందు ఉంది పండగ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఏకే ఎంటర్‌టైన్ మెంట్స్ రూపొందిస్తున్న ఈ సినిమాకు రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu