HomeTelugu Trendingసమంత ' ఓ బేబీ' కి అరుదైన గౌరవం

సమంత ‘ ఓ బేబీ’ కి అరుదైన గౌరవం

5 2ప్రముఖ నటి సమంత హీరోయిన్ గా చేస్తున్న ఓ బేబీ మూవీ జులై 5 వ తేదీన భారీ ఎత్తున విడుదల కాబోతున్నది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కొరియన్ మూవీ మిస్ గ్రానీకి ఇది రీమేక్. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ కాబోతున్నది. సమంత పుట్టిపెరిగింది చెన్నైలోనే కాబట్టి.. సమంత మూవీకి అక్కడ అరుదైన గౌరవం లభించింది.

ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని మొదటిసారి ఎర్లీ మార్నింగ్ షో వేసుకోవడానికి అనుమతి లభించింది. చెన్నైలోని ప్రఖ్యాత థియేటర్ జీకే సినిమాస్ లో ఉదయం 8 గంటలకు స్పెషల్ షో వేస్తున్నారు. నిజంగా ఇది గ్రేట్ అని చెప్పాలి. తెలుగు కంటే తమిళ వెర్షన్ ముందుగా రిలీజ్ కాబోతున్నదన్నమాట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu