HomeTelugu Trendingఅఖిల్‌తో 'సైరా' డైరెక్టర్‌!

అఖిల్‌తో ‘సైరా’ డైరెక్టర్‌!

9 7

దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతాడనుకున్న ఈ డైరెక్టర్ తదుపరి చిత్రం ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. సైరా సినిమాతో దర్శకుడు సురేందర్‌రెడ్డికి మంచి మార్కులే వచ్చాయి. సైరా విడుదలై రెండేళ్లు కావస్తోంది. ఆ మధ్య మహేష్, ప్రభాస్‌ కథ చెప్పి ఒప్పించేందుకు ఈ దర్శకుడు ప్రయత్నాలు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అల్లు అర్జున్‌, వరుణ్ తేజ్, రామ్ ఇలా పలువురి పేర్లు కూడా వినిపించాయి. తాజాగా అఖిల్‌తో సురేందర్ రెడ్డి తదుపరి చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచిలర్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇంకా తన తదుపరి చిత్రానికి దర్శకుడిని ఫైనల్ చేయలేదు. ఇటీవలే సురేందర్ రెడ్డి ఓ కథ వినిపించారని అది అఖిల్‌కు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం రాబోతుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu