ప్రముఖ రేసింగ్ కాంపిటీషన్లో నాగచైతన్య


అక్కినేని నాగచైతన్య కేవలం సినిమాలతోనే కాకుండా ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్ లలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు. ముఖ్యంగా రేసింగ్ కు సంబంధించిన స్పోర్ట్స్ పై అయితే నాగచైతన్యకు చాలా ఆసక్తి ఉంది. ఇక నాగచైతన్య వద్ద ఉన్న కార్ కలెక్షన్స్ బైక్ కలెక్షన్స్ కూడా చాలా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటాయి. అయితే నాగచైతన్య ఇప్పుడు మరొక ప్రముఖ రేసింగ్ కాంపిటీషన్లో భాగం కాబోతున్నాడు.

హైదరాబాదులో ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా మోటార్‌స్పోర్ట్ రేసింగ్ లీగ్స్ కొనసాగనున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందులోకి నాగచైతన్య టీమ్ కూడా ప్రవేశించబోతోంది. హైదరాబాద్ బ్లాక్‌బర్డ్స్ టీం ను నాగచైతన్య కొనుగోలు చేశారు. దీంతో ఈ గేమ్ పై ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరింత ఆసక్తి పెరిగింది. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో తనదైన ముద్ర వేసిన HBB జట్టు ఫార్ములా 4 ఇండియన్ ఛాంపియన్‌షిప్ ప్రారంభ సీజన్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది.

ఈ ఉత్తేజకరమైన కొత్త వెంచర్‌ను రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RPPL) నిర్వహించింది. ఫార్ములా 1, సూపర్‌కార్స్ మోటార్‌సైకిళ్లను ఎప్పుడూ అమితంగా ఆరాధించే నాగ చైతన్యకు మోటార్‌స్పోర్ట్‌పై కూడా ఎప్పటినుంచో ఆసక్తిని కనబరుస్తున్నాడు. ఇక ఇన్నాళ్లకు అతను హైదరాబాద్ జట్టుకు యజమానిగా ఉండడం హైలైట్ గా నిలిచింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates