HomeTelugu Trendingసైరాకు ఏడాది.. రామ్‌ చరణ్‌ ట్వీట్‌

సైరాకు ఏడాది.. రామ్‌ చరణ్‌ ట్వీట్‌

Ram charan twitted first an
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ట్విటర్‌ వేదికగా ‍స్పందించారు. బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ ఈ సినిమాకు రామ్‌చరణ్‌ ప్రొడ్యూస్‌ చేశారు. కాగా సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఙతలు తెలిపారు రామ్‌ చరణ్‌. ‘బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌, బెస్ట్‌ క్రూ, ఏ బ్రిలియంట్‌ టీం, థ్యాంక్యూ వన్‌ అండ్‌ ఆల్‌’ అని రామ్‌చరణ్‌ ట్వీట్‌ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా నరసింహారెడ్డి తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇందులో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా, తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించారు. ఇక బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషించారు. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తొలి ఏడాది పూర్తి అయిన సందర్భంగా సురేందర్‌ రెడ్డి కూడా తనని నమ్మి సినిమా చేసిన చిరంజీవికి, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu