HomeTelugu Newsఅక్షయ్ ట్విట్టర్‌లో '2 పాయింట్ 0' న్యూ పోస్టర్‌

అక్షయ్ ట్విట్టర్‌లో ‘2 పాయింట్ 0’ న్యూ పోస్టర్‌

3 14సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘2 పాయింట్ 0’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు అక్షయ్ కుమార్ విలన్‌ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్‌ను అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పోస్టర్ ఆసక్తికరంగా మారింది. పోస్టర్ పై భాగంలో క్రోమ్యాన్ అక్షయ్ కుమార్ ఉంటె.. కింద చిట్టి రోబోలు గ్లోబ్ ఆకారంలో అనేకం ఉంటాయి. ఈ పోస్టర్ చూస్తే ఎవరికైనా భయం కలుగుతుంది. తీవ్రంగా ఉంటె కనులుకలిగిన అక్షయ్ కుమార్ థియేటర్లో భయపెట్టడం ఖయం అని సినీపండితులు అంటున్నారు.

సైంటిఫిక్ నేపథ్యంలో సాగే సినిమా అయినప్పటికీ ఊహకు అందని ఊహాతీతమైన శక్తులు కూడా ఇందులో ఉండబోతున్నాయని సమాచారం. ఆసియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu