HomeTelugu Trending'అలా నిన్ను చేరి' టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల

‘అలా నిన్ను చేరి’ టైటిల్‌ లోగో, మోషన్‌ పోస్టర్‌ విడుదల

Ala ninnu cheri movie title
కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో దినేష్ తేజ్ .. హెబ్బా పటేల్ .. పాయల్ .. రాధాకృష్ణ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘హుషారు’ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో దినేష్ తేజ్ మరోసారి ఈ విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా షురూ చేసి న్యూ ఇయర్ కానుకగా ‘అలా నిన్ను చేరి’ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ లను రిలీజ్ చేశారు. ఈ టైటిల్ ‘లోగో’ పోస్టర్‌ని చాలా డిఫరెంట్ గా డిజైన్ చేసి, సినిమా సోల్ తెలిసేలా స్పెషల్ గా అట్రాక్ట్ చేశారు. ఈ సినిమాకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా, సుభాష్ ఆనంద్ సంగీతాన్ని సమకూర్చాడు. అతి త్వరలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu