HomeTelugu Big Storiesఆర్‌ఆర్‌ఆర్‌ నుండి 'సీత' లుక్‌ వచ్చేసింది

ఆర్‌ఆర్‌ఆర్‌ నుండి ‘సీత’ లుక్‌ వచ్చేసింది

Alia Bhatt look From RRR

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్.ఆర్.ఆర్’. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ అలియా భట్ ‘సీత’గా సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా అలియా కనిపించనుంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ఒలివియా మోరిస్ నటిస్తోంది. కాగా ఈరోజు (మార్చి 15) ఆలియా పుట్టినరోజుని పురస్కరించుకుని సీత పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ లుక్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని అక్టోబర్ 13న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

RRR: Alia Bhatt in the role of Sita

Recent Articles English

Gallery

Recent Articles Telugu