HomeTelugu Trendingఆల్బమ్‌లోనూ అదరగొట్టిన అలియా భట్

ఆల్బమ్‌లోనూ అదరగొట్టిన అలియా భట్

1 16

బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆలియా భట్‌. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తన అందాలతో మెప్పించిన ఈ భామ ఇప్పుడు ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌లో తొలిసారిగా మెరిసింది. డోర్‌బీన్‌ అనే బ్యాండ్‌కు చెందిన ఓంకార్‌, గౌతమ్‌ అనే ఆర్టిస్టులు కంపోజ్‌ చేసిన ప్రాడా అనే పాటలో ఆడిపాడింది. ఇటీవల ఈ పాట వీడియోను విడుదల చేశారు. తక్కువ సమయంలోనే వీడియోను కోటి మందికిపైగా వీక్షించారు. ఈ నేపథ్యంలో ఆలియా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రాడా పాట కోసం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేశారు. అందులో ఆలియా భట్ కొరియోగ్రాఫర్లతో పాటు ఉత్సాహంగా స్టెప్స్ వేస్తూ కనిపించింది. ఇప్పటి దాకా ఆలియా పలు సినిమాల్లో పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే మొదటి సారిగా ఓ ఆల్బమ్‌లో కనిపించడం విశేషం. ఈ వీడియో చూసిన అభిమానులు ఆలియా డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఆలియా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్‌ మూవీతో పాటు బ్రహ్మాస్త్ర, తఖ్త్‌, ఇన్‌షా అల్లా సినిమాలతో బిజీగా ఉంది.

View this post on Instagram

That rehearsal life💃🏻🐒 #ThePradaSong

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

Recent Articles English

Gallery

Recent Articles Telugu